హిందీలో మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు రంగం సిద్ధమైంది. కండల వీరుడు జాన్ అబ్రహం 2020 ఆగస్టు 14న 'ఎటాక్' చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశాడు. ఇందుకు రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ కూడా సహకారం అందిస్తున్నారు.
'ఎటాక్'కు జాన్ అబ్రహం సిద్ధం.. - JohnAbraham
జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎటాక్'. ఈ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ----
ఎటాక్
కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత కథ అని సమాచారం. ఇందులో జాన్ యాక్షన్ మరో స్థాయిలో ఉంటుందని వినికిడి. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు ప్రేక్షకులను పలకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వచ్చే ఏడాది రాబోయే భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాల్లో 'ఎటాక్' కూడా ఒకటి.
ఇవీ చూడండి.. సినీ వినీలాకాశంలో సిల్క్ స్మిత మరపురాని జ్ఞాపకం
Last Updated : Dec 2, 2019, 9:49 AM IST