తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రికార్డ్​ గేమ్​: అవెంజర్స్​కు 'జాన్​విక్​ 3' షాక్​ - johnwick 3

మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అగ్రస్థానంలో నిలిచిన 'అవెంజర్స్ ఎండ్​గేమ్' సినిమా రెండో స్థానానికి పడిపోయింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'జాన్​విక్ 3' మొదటి స్థానంలో నిలిచింది.

అవెంజర్స్

By

Published : May 20, 2019, 10:14 AM IST

Updated : May 20, 2019, 10:33 AM IST

'అవెంజర్స్​ ఎండ్​గేమ్​'కు మూడు వారాల్లో తొలిసారిగా గట్టి పోటీ ఎదురైంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా వెనుకబడింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'జాన్​విక్ 3' దెబ్బకు రెండో స్థానానికి చేరింది.

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్​ 'జాన్​విక్' సీరిస్​లో మూడో సినిమాగా వచ్చిన 'జాన్​విక్ ఛాప్టర్-3 పారాబెల్లుమ్' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కీనూ రీవ్స్ ప్రధాన పాత్రలో నటించాడు. మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచిన 'అవెంజర్స్​ ఎండ్​గేమ్'​ రెండో స్థానానికి పడిపోయింది.

అవెంజర్స్​ను వెనక్కు నెట్టిన జాన్​విక్ 3

యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వివరాలు
జాన్​విక్ 3 - 5.7 కోట్ల డాలర్లు
అవెంజర్స్ ఎండ్​గేమ్ - 2.9 కోట్ల డాలర్లు
పోకిమన్ డిటెక్టివ్ పికాచు - 2.48 కోట్ల డాలర్లు

Last Updated : May 20, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details