బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు రేసింగ్ చిత్రాల సిరీస్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'. ఇప్పటివరకు ఈ సిరీస్లో వచ్చిన 8 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలో రూపొందనున్న తొమ్మిదో సినిమాకు ఓ స్టార్ జత కలిశాడు. ఈ చిత్రంలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా నటించనున్నాడని యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సిరీస్లో జాన్ సీనా నటిస్తాడని ఏప్రిల్లోనే హీరో విన్ డీజిల్ చెప్పగా... ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది.