తెలుగులో గుమ్మడి చాలా సినిమాల్లో గుండెపోటు వచ్చే పాత్రల్లో కనిపించారు. ఓ దశలో అతడిని 'గుండెపోటు గుమ్మడి' అనేవారు కూడా. ఒక్కో నటుడు ఒక్కో పాత్రలో మెప్పిస్తే వరుసపెట్టి అలాంటి పాత్రలే రావడం సహజం. మరి హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా చనిపోయే పాత్రలు వేసింది ఎవరో తెలుసా? ఆ ఘనత జాన్ హర్ట్‌కు దక్కుతుంది. ఈయన మొత్తంగా 43 వేర్వేరు సినిమాల్లో నటించి, పాత్రల పరంగా 'చనిపోయారు'. ఎలియన్, స్పేస్‌బాల్స్, హెల్‌బాయ్, వి ఫర్ వెండెట్టా లాంటి చిత్రాలు ఆ జాబాతిలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో జాన్ మరణించిన ప్రతిసారి.. ఆ సీన్ చూస్తున్న సగటు ప్రేక్షకుడికి కన్నీరు రాక మానదు. అంతగా ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు.
మరణించడంలోనూ హాలీవుడ్ నటుడు రికార్డు - జాన్ హర్ట్ చనిపోయే పాత్రలు
మనిషి జీవితంలో ఒక్క సారి మాత్రమే చనిపోతాడు. ఇది మాకు తెలిసిన విషయమే కదా అనుకుంటున్నారా? కానీ ఓ వ్యక్తి మాత్రం తన జీవితంలో ఏకంగా 43సార్లు మరణించి రికార్డుల్లోకెక్కారు. ఇదేలా సాధ్యమనుకుంటున్నారా?
జాన్ హర్ట్
1940 జనవరి 22న జాన్ హర్ట్ జన్మించారు. 1962లో 'ది వైల్డ్ అండ్ ది విల్లింగ్'తో అరంగేట్రం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్, భాప్టా(BAFTA) అవార్డులను అందుకున్నారు. హ్యారీ పోటర్ సిరీస్లో 'మిస్టర్ ఒలివ్యాండర్' పాత్ర విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దాదాపు 50ఏళ్ల పాటు చిత్రసీమలో కొనసాగి, 2017 జనవరి 25న తుదిశ్వాస విడిచారు.
ఇదీ చూడండి : యాషిక ఆనంద్: భలేగా ఉంది బాలా నీ నవ్వు!