తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాన్​ అబ్రహాంకు జోడిగా అదితి.. ఫస్ట్​లుక్ విడుదల​ - john abrahams look in cross-border drama

బాలీవుడ్​ స్టార్​ హీరో జాన్​ అబ్రహాం సరసన నటిస్తోంది హైదరాబాదీ భామ అదితిరావు. ఈ చిత్రం మూడు తరాల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఇదే సినిమాలో మరోహీరో అర్జున్​కపూర్​కు జోడిగా రకుల్​ ఎంపికైంది.

John-Aditi's first look
అర్జున్‌ కపూర్‌కు అమ్మమ్మగా.. జాన్​ అబ్రహాంకు జోడిగా అదితిరావు

By

Published : Aug 26, 2020, 7:43 PM IST

కాశ్వీ నాయర్‌ దర్శకత్వంలో మూడు తరాల ప్రేమకథ నేపథ్యంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాయికానాయకులుగా అర్జున్‌ కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో మరో ఇద్దరు బాలీవుడ్‌ నటులు చేరారు. వారిలో జాన్‌ అబ్రహాం, అదితీరావు హైదరీలు కీలకపాత్రలో నటించనున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారిగా షూటింగ్ ప్రారంభించిన మొదటి చిత్రం ఇదే.

టీ- సీరీస్‌, జెఏ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ అబ్రహాం, నిఖిల్‌ అడ్వాణీలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండోర్‌ షూటింగ్‌లో ఒక వారం పాటు జాన్‌, అదితీలు పాల్గొననున్నారు. మళ్లీ అక్టోబర్‌ నెలలో అవుట్‌డోర్‌ షూటింగ్‌లో నాయికానాయకులు కలిసి పాల్గొంటారు. అదితీరావు... అర్జున్ కపూర్‌కు అమ్మమ్మ పాత్రలో నటించనుంది.

చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడింది అతిదిరావు. "జాన్‌, నేను 1946 - 47 కాలం పాత్రల్లో నటిస్తాం. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నాను" అని అదితి చెప్పింది.

1947 నుంచి 2020 మధ్య కాలంలో ఈ ప్రేమకథ కొనసాగుతుందని సమాచారం. జాన్‌ అబ్రహాం తొలిసారిగా సర్దార్‌ పాత్రలో నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details