బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న కొత్త చిత్రం 'సత్యమేవ జయతే 2' షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. మరో రెండు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చిత్రబృందం ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా విడుదలపై హీరో క్లారిటీ ఇచ్చారు. 'సత్యమేవ జయతే' సీక్వెల్‌ను రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ ఏడాది మే 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడించారు. మరోవైపు సల్మాన్ నటించిన 'రాధే' సినిమానూ రంజాన్‌కే విడుదల చేయనున్నారని సమాచారం. అదే నిజమైతే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద తీవ్ర పోటీ నెలకొంటోంది.