'సత్యమేవ జయతే' చిత్రం జాన్ అబ్రహాంకు ఎంతో గుర్తింపు తెచ్చింది. దీనికి సీక్వెల్‌గా దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కిస్తున్న 'సత్యమేవ జయతే-2' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.
'సత్యమేవ జయతే-2' విడుదల తేదీ ఖరారు - సత్యమేవ జయతే సినిమా
బాలీవుడ్ నటుడు జాన్అబ్రహాం నటిస్తున్న కొత్త చిత్రం 'సత్యమేవ జయతే-2'. ఈ సినిమాను రంజాన్ సందర్భంగా వచ్చే ఏడాది మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
!['సత్యమేవ జయతే-2' విడుదల తేదీ ఖరారు John Abraham starrer Satyameva Jayate 2 gets release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8878580-576-8878580-1600668131904.jpg)
'సత్యమేవ జయతే-2' విడుదల తేదీ ఖరారు
"ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో అక్కడ.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది" అనే స్లోగన్‌ను పోస్టర్‌పై క్యాప్షన్‌గా పెట్టారు.
అందులో జాన్అబ్రహాం నాగలి పట్టుకొని ఉండగా.. అతని శరీరంపైన ఉన్న గాయాల నుంచి త్రివర్ణంలో రుధిరం కారుతున్నట్లు ఉన్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 2021 మే 12న రంజాన్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.