తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో గాయపడ్డ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం - అటాక్ షూటింగ్​లో గాయపడ్డ జాన్ అబ్రహం

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం షూటింగ్​లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు.

John Abraham
జాన్ అబ్రహం

By

Published : Feb 15, 2021, 4:44 PM IST

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం 'అటాక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్​ సమయంలో ఇతడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని అబ్రహం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన ఫొటోతో పాటు గాయాన్ని కాటన్​తో తడుస్తున్న వీడియోను షేర్ చేశాడీ హీరో. "అలా మొదలైంది. ఇలా కొనసాగుతోంది" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

జాన్ అబ్రహం త్వరలోనే 'సత్యమేవ జయతే 2' చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. 2018లో వచ్చిన యాక్షన్ డ్రామా 'సత్యమేవ జయతే'కు సీక్వెల్ ఇది. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మనోజ్ బాజ్​పేయ్, దివ్యా ఖోస్లా కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details