తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గత 18 ఏళ్లలో ఐదు రోజులే సెలవు తీసుకున్నా' - John Abraham

తన జీవితంలోని జయపజయాలను, స్నేహితులతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు హీరో జాన్​ అబ్రహాం. ముంబయిలో ఓ ప్రైవేట్​ ఛానల్​లో జరిగిన చాట్ షోలో తన జీవిత అనుభవాల్ని పంచుకున్నాడు.

John Abraham: Failure really doesn't affect me
'గత 18 ఏళ్లలో ఐదు రోజులే సెలవు తీసుకున్నా'

By

Published : Dec 30, 2019, 8:11 PM IST

ఓటమికి భయపడకుండా ముందుకు సాగడమే తన జీవితంలోని ప్రయోజనకర అంశమన్నాడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. దీనితో పాటే తాను ఎదుర్కొన్న జయపజయాలను ఓ చాట్ షోలో వెల్లడించాడు.

"నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా.. అప్పటి విలువలను బలంగా నమ్ముతాను. నా జీవితంలో ఇప్పటి వరకూ ఎన్నో విజయాలను, అపజయాలను చూశాను. అందుకే ఓటమితో ఎప్పుడూ ప్రభావితం చెందను"
- జాన్​ అబ్రహాం, బాలీవుడ్​ హీరో

తన జీవితంలో స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు జాన్​ అబ్రహాం.

"నా స్నేహితులలో ఒకరైన సుకు ఆటోరిక్షా డ్రైవర్​.. నన్ను రోజూ అఫీస్​ నుంచి తీసుకువచ్చేవాడు. ఒకరోజు తనతో కలిసి 'కాకా కాకా' అనే తమిళ సినిమా చూశాను. ఆ చిత్రాన్ని రీమేక్​ చేయమని సుకు సలహా ఇచ్చాడు. అప్పుడే 'ఫోర్స్​' తీశా"
- జాన్​ అబ్రహాం, బాలీవుడ్​ నటుడు

హాలీడే ప్లాన్స్​ ఏమైనా చేసుకున్నారా.. అని అడిగిన ప్రశ్నకు జాన్​ అబ్రహాం.. "నేను పని రాక్షసుడిని. గత 18 ఏళ్లలో కేవలం 5 రోజులే సెలవు తీసుకున్నాను" అని బదులిచ్చాడు.

ఇదీ చదవండి:- 'విజయ్.. నా స్నేహితుడు.. ప్రేమికుడు.. భర్త'

ABOUT THE AUTHOR

...view details