సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు మోహిత్ సూరి. హీరో జాన్ అబ్రహంను సంప్రదించాడని సమాచారం. ఇందులో మరో పాత్రలో ఆదిత్య రాయ్ కపూర్ నటించనున్నాడట.
ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ఏక్తా కపూర్ సంయక్తంగా నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.