స్టార్ హీరో సినిమా వస్తోంది అంటే సగటు ప్రేక్షకుడి నుంచి సాధారణ ప్రజల వరకు ఉత్సాహం చూపిస్తారు. ఎలాగైనా సరే తొలిరోజు తొలి ఆట చూడాలని తాపత్రయపడతారు. కొందరికే ఈ అవకాశం దక్కుతుంది. అలాంటి వారి కోసం రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ.. ముంబయిలో సోమవారం జరిగిన వార్షిక సమావేశంలో సరికొత్త ఆఫర్ ప్రకటించారు. జియో గిగా ఫైబర్‌తో ప్రీమియం వినియోగదారులు 'ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా' ఇక ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. 2020 ద్వితీయార్థంలో అందుబాటులోకి రానుంది.
జియో గిగాఫైబర్‌తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్‌డే ఫస్ట్ షో' - రిలయన్స్ జియో గిగా ఫైబర్
సినీ ప్రియులకు 'జియో గిగా ఫైబర్' అద్భుతమైన అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఇంట్లోనే చూసే సదుపాయాన్ని త్వరలో తేనుంది.
జియో గిగా ఫైబర్:చూసేయండి ఇక 'ఫస్ట్‌డే ఫస్ట్ షో'
సాధారణంగా సినిమా రిలీజ్ అయిన వెంటనే పూర్తి హెచ్డీ క్వాలిటీతో చూడాలంటే కష్టం. ఆ ప్రింట్ కొన్ని రోజుల తర్వాతే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు 'జియో గిగా ఫైబర్' ఆ ఇబ్బందుల్ని తీర్చుతుందనే చెప్పాలి.
ఇది చదవండి: లైవ్: సెప్టెంబర్ 5 నుంచి గిగాఫైబర్ సేవలు
Last Updated : Sep 26, 2019, 5:57 PM IST