తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృష్ణమాచారి పాత్రలో జీవా.. లుక్​ ఇదిగో - కృష్ణమాచారి శ్రీకాంత్​గా జీవా

టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం '83'. రణ్​వీర్ సింగ్ కపిల్ పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని కృష్ణమాచారి శ్రీకాంత్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Jiiva
జీవా

By

Published : Jan 13, 2020, 9:00 AM IST

టీమిండియా 1983 ప్రపంచకప్‌ హీరో కపిల్‌దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం '83'. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ కపిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. కాగా, రణ్‌వీర్‌ శనివారం 83 పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అలాగే అప్పటి దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌నూ విడుదల చేశాడు. అందులో తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ గావస్కర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు.

తాజాగా ఆదివారం ఇంకో పోస్టర్‌ను విడుదల చేయగా అందులో జీవాను పరిచయం చేసింది చిత్రబృందం. 'రంగం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా ఈ సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రను పోషిస్తున్నాడు.

కృష్ణమాచారి పాత్రలో జీవా.. లుక్​ ఇదిగో

ఇవీ చూడండి.. త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ పేర్లు ఎందుకలా?

ABOUT THE AUTHOR

...view details