తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అలా నన్ను చూసి భావోద్వేగానికి గురయ్యారు' - Gunjan Saxena The Kargil Girl news

బాలీవుడ్​ హీరోయిన్ జాన్వీ కపూర్​.. 'గుంజన్​ సక్సేనా.. ద కార్గిల్​ గర్ల్'​లో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుందీ సినిమా. మార్చి నెలలో థియేటర్లలోకి రానుంది. షూటింగ్​ సమయంలో జరిగిన ఓ అనుభవాన్ని అభిమానులతో పంచుకుందీ భామ.

Jhanvi kapoor
ఆ సమయంలో కన్నీళ్లాగలేదు: జాన్వీ

By

Published : Jan 18, 2020, 3:59 PM IST

'దఢక్​'తోబాలీవుడ్​కుపరిచయమైన హీరోయిన్ జాన్వీ కపూర్​... ప్రస్తుతం 'గుంజన్​ సక్సేనా.. ద కార్గిల్​ గర్ల్​'లో నటిస్తోంది. శరణ్​ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. యుద్ధంలో పాల్గొన్న భారత తొలి మహిళా ఫైలట్​ గుంజన్​ సక్సేన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గత డిసెంబర్​లో చిత్రీకరణ పూర్తయింది. అయితే ఆ​ సమయంలో తన కల ఎలా నెరవేరిందో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

'గుంజన్​ సక్సేనా.. ద కార్గిల్​ గర్ల్'​లో జాన్వీ కపూర్

" ఫైలట్​ అవ్వాలన్నది నా కల. అయితే నిజ జీవితంలో చేయలేకపోయినా ఇందులో నేను అనుకున్నది నెరవేరింది. యుద్ధ హెలికాప్టర్‌ నడిపాను. నాతో పాటు ఓ పైలట్‌ ఉండేవారు. గంటల కొద్దీ అందులోనే గడిపాను. ఇష్టం వల్ల చాలా త్వరగా హెలికాప్టర్​ నియంత్రణ నేర్చుకున్నా. సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు నుంచీ నాకు పైలట్‌ కావడం అంటే చాలా ఇష్టమని సెట్‌లో అందరితోనూ చెప్పేదాన్ని. షూటింగ్‌ మొదలయ్యాక తొలిసారి పైలట్‌గా హెలికాప్టర్‌ ఎక్కగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. నాకే కాదు సెట్లో ఉన్న చాలామంది నన్ను చూసి భావోద్వేగానికి గురయ్యారు"

-- జాన్వీ కపూర్​, బాలీవుడ్​ నటి

ఇందులో పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ తదితరులు నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'దోస్తానా 2', 'రూహ్ ఆఫ్జా'లోనూ నటిస్తోంది జాన్వీ.

ABOUT THE AUTHOR

...view details