తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్.ఆర్.ఆర్'​లో జాన్వీ నటించనుందా..? - ఆర్.ఆర్.ఆర్

రాజమౌళి దర్శకుడిగా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. హీరోయిన్​.. స్వర్గీయ​ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇందులో నటించనుందని సమాచారం.

'ఆర్.ఆర్.ఆర్'​లో జాన్వీ నటించనుందని సమాచారం

By

Published : Apr 9, 2019, 12:54 PM IST

ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నారు. ఓ హీరోయిన్​గా చేస్తున్న డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి ఈ మధ్యే తప్పుకుంది. మరో కథానాయిక కోసం వెతికే పనిలో ఉంది చిత్రబృందం. తాజాగా ఆ స్థానంలో జాన్వీ కపూర్ లేదా శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ఊహాగానాలొస్తున్నాయి. ఆలియా భట్ ఇప్పటికే ఓ కథానాయిక​గా నటిస్తోంది.

ఇదీ చదవండి: ఆర్.ఆర్.ఆర్ నుంచి తప్పుకున్న ఓ హీరోయిన్

1920ల నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తారక్.. కొమురం భీం, చరణ్... అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో షూటింగ్ జరుపుకుంటోందీ సినిమా.

సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్-రాంచరణ్

ఇటీవలే రాంచరణ్ కాలికి గాయమైంది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఇదీ చదవండి: ఆర్​ఆర్​ఆర్​ సినిమా చిత్రీకరణకు పాత కాలం కార్లు

సూమారు రూ.300 కోట్ల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details