తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆశ కంటే ఆశయం గొప్పది'.. బాలకృష్ణ మెచ్చిన ట్రైలర్ - బాలకృష్ణ న్యూస్

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ చేతుల మీదుగా 'జెట్టి' ట్రైలర్ విడుదలైంది. మత్స్యకార నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

jetty trailer launched by balakrishna
బాలకృష్ణ, డైరెక్టర్ సుబ్బు

By

Published : Oct 22, 2021, 6:48 AM IST

నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జెట్టి'. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కె.వేణు మాధవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హీరో బాలకృష్ణ ట్రైలర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'నా ఆశకంటే మా నాన్న ఆశయం గొప్పది సర్‌' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. 'జెట్టి' కోసం రెండు వర్గాల మధ్య సాగే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 'మేం వెనకబడే ఉన్నాం. కానీ, వెన్నుపూస కూడా వెనకే ఉంటుంది సర్‌. ఎందుకో తెలుసా? మనిషిని నిలబెట్టడానికి, ముందుకు నడిపించడానికి' అని కథానాయిక తండ్రి చెప్పిన ఈ సంభాషణ అందరినీ మెప్పించేలా ఉంది. మరి నందిత అనుకున్నట్టుగా తన తండ్రి ఆశయం నెరవేరుతుందా? అసలు 'జెట్టి' కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

"ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రం నిర్మించాం. మత్స్యకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను దర్శకుడు ఎంతో చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని నిర్మాత అన్నారు. కార్తిక్‌ కొండకండ్ల సంగీతమందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details