ఇటీవలే 'కబీర్‌సింగ్'తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన హీరో షాహిద్ కపూర్ తర్వాత సినిమా ప్రకటన వచ్చింది. ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. టాలీవుడ్ కథానాయకుడు నాని సూపర్‌హిట్ చిత్రం 'జెర్సీ' బాలీవుడ్ రీమేక్‌లో నటించనున్నాడు షాహిద్.
అల్లు అరవింద్, దిల్‌రాజు.. అమన్గిల్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.