తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జెర్సీ' హిందీ రీమేక్​ షూటింగ్​కు డేట్ ఫిక్స్ - latest bollywood movie

టాలీవుడ్​ హిట్ సినిమా 'జెర్సీ'ని హిందీలో రీమేక్​ చేస్తున్నారు. షాహిద్​ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే నెల 2 నుంచి చంఢీగడ్​లో​ షూటింగ్ ప్రారంభం కానుంది.

JERSI REMAKE IN HINDI WITH SHAHID KAPUR
డిసెంబర్‌ 2న 'జెర్సీ' షూటింగ్‌ ప్రారంభం!

By

Published : Nov 26, 2019, 4:31 PM IST

హీరోలంతా ఈ మధ్య ఎక్కువగా రీమేక్​ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. తెలుగులో వచ్చిన 'అర్డున్​రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్​ సింగ్'​గా తెరకెక్కించారు. అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించిందీ చిత్రం. ఇందులో కబీర్​సింగ్​గా మెప్పించాడు బాలీవుడ్​ హీరో షాహిద్​ కపూర్​. ఇప్పుడు మరో తెలుగు చిత్రం 'జెర్సీ'ని రీమేక్​ చేస్తున్నాడు.

వచ్చే నెల 2 నుంచి చంఢీగడ్​లోని క్రికెట్‌ స్టేడియంలో షూటింగ్​ ప్రారంభం కానుంది. కొద్దిరోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది. మృణాల్​ ఠాకూర్హీరోయిన్​​. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు.

బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్‌ గిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:'మా' నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమే: నరేష్​

ABOUT THE AUTHOR

...view details