తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జెర్సీ' ట్రైలర్ రిలీజ్ డేట్​​.. గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం - goutam new movie

మూవీ అప్​డేట్స్ వచ్చేశాయి. షాహిద్ కపూర్ 'జెర్సీ' (Jersey Trailer Release Date) ట్రైలర్​ విడుదల తేదీతో పాటు, 'బాబ్​ బిశ్వాస్'​ సినిమా రిలీజ్ డేట్​ వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.

movie updates
మూవీ అప్​డేట్స్​

By

Published : Nov 19, 2021, 10:07 PM IST

తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం సొంతం చేసుకున్న 'జెర్సీ' సినిమా.. షాహిద్​ కపూర్ హీరోగా ప్రస్తుతం అదే పేరుతో బాలీవుడ్​లో (Jersey Hindi Movie) రీమేక్ అవుతోంది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri).. హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్​ను (Jersey Trailer Release Date) నవంబర్​ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న షాహిద్ ఈ కార్యక్రమం కోసం.. ముంబయికి రానున్నారు. ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

షాహిద్ కపూర్​

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హీరోగా.. తివ్యా అన్నపూర్ణ దర్శకత్వం వహించిన చిత్రం 'బాబ్ బిశ్వాస్'​. ఈ సినిమా డిసెంబరు 3న (Bob Biswas Release Date) జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. రెడ్​ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

బాబ్ బిశ్వాస్​

కొత్త తరహా కథలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు గౌతమ్‌ (Raja Goutham).. కొత్త సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఎస్‌.ఒరిజినల్స్‌ పతాకంపై సృజన్‌ యారబోలు నిర్మించనున్నారు. ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం

మోనోఫోబియాతో బాధపడుతన్న ఒక రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పడు.. ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. శ్రీరామ్‌ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ కె.సంతోష్‌, సినిమాటోగ్రఫి మోహాన్‌ చారి.

ఇదీ చూడండి:RRR Movie: 'ఆర్ఆర్​ఆర్​'లో అజయ్​ దేవ్​గణ్ పాత్ర ఇంతేనా?

ABOUT THE AUTHOR

...view details