తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదు' - క్రికెటర్ సునీల్ లంబా

క్రికెటర్ పాత్రలో నాని నటించిన సినిమా 'జెర్సీ'. అందరూ అనుకుంటున్నట్లు ఈ చిత్రం.. బయోపిక్ కాదని హీరో నాని చెప్పాడు. ఓ కల్పిత కథతోనే తెరకెక్కించామని స్పష్టం చేశాడు.

జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదంటున్న హీరో నాని

By

Published : Apr 10, 2019, 5:36 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొత్త సినిమా 'జెర్సీ'. షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. నాని గత 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఈ సినిమాతో ఎలాగైనా సరే మళ్లీ విజయం దక్కించుకోవాలని అనుకుంటున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్​గా నటించింది. 'మళ్లీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా క్రికెటర్ సునీల్ లంబా బయోపిక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాడు హీరో నాని. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీయలేదని చెప్పాడు. ప్రేక్షకులు మాత్రం ఇది నిజం కథ అనుకునేలా ఉంటుందని తెలిపాడు.

ఇప్పటికి ఈ సినిమాను ఓ ఇరవై సార్లు చూసుంటా. ప్రతిసారి కొత్తగానే అనిపించింది. రేపు ప్రేక్షకులూ అలానే భావిస్తారు. -నాని, తెలుగు హీరో

అనిరుధ్ రవిచందర్ సంగీతమందించిన ఇందులోని పాటలు సినీ ప్రేక్షకుల్ని ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

ఇది చదవండి: 'ఇప్పుడే వస్తాను..పెళ్లి చేసుకుందాం' అంటున్న నాని

ABOUT THE AUTHOR

...view details