కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్. 1995లో మార్క్ సెలిగర్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన తన నగ్న ఫొటోలను అమ్మకానికి పెట్టింది. 25 ఏళ్ల వయసులో తీసుకున్న చిత్రాలను కరోనా విరాళల కోసం విక్రయానికి పెట్టినట్లు ఆ నటి వెల్లడించింది.
ఆ ఫొటోలను కొను క్కునే విధానాన్ని ఇన్స్టా వేదికగా పంచుకుంది అనిస్టన్. ఈ విధంగా సేకరించిన నిధులను అమెరికాలోని కరోనా వైద్య పరీక్షలు, చికిత్సలను ఉచితంగా అందిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు తెలిపింది.