సినీ నటుడు రాజశేఖర్,తన భర్త.. కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ఆయన భార్య జీవిత స్పష్టం చేశారు. రాజశేఖర్ కారు ప్రమాద సంఘటనపై స్పందించారు.
మీ ప్రేమాభిమానాల వల్లే రాజశేఖర్ సురక్షితం:జీవిత - jeevitha rajsekhar on rajsekhar accident
హీరో రాజశేఖర్‌కు జరిగిన కారు ప్రమాదం గురించి ఆయన భార్య జీవిత మాట్లాడారు. అభిమానుల ఆశీస్సుల వల్ల సురక్షితంగానే ఉన్నారని చెప్పారు.
![మీ ప్రేమాభిమానాల వల్లే రాజశేఖర్ సురక్షితం:జీవిత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5047691-1039-5047691-1573628242928.jpg)
"రాజశేఖర్‌కు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలు చూసిన చాలా మంది అభిమానులు కంగారుపడి నాకు ఫోన్స్ చేస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే. నిన్న రాత్రి 1.30గంటల సమయంలో రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి కారులో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో టైర్ పేలడం వల్ల ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డుపక్కకు పడిపోయింది. ఆ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఓ కుటుంబం రాజశేఖర్ అరుపులు విని ప్రమాదం జరిగిన కారు వద్దకు చేరుకుంది. వెంటనే ఆయన్ను కారు నుంచి బయటకు తీశారు. వారి వద్ద నుంచి ఫోన్ తీసుకుని ఆయన మాకు కాల్ చేసి మమ్మల్ని రమ్మని చెప్పారు. అంతేకాకుండా పోలీసులకూ ప్రమాదం గురించి చెప్పారు. మేము వెళ్లి ఆయన్ని ఇంటికి తీసుకువచ్చాం. అనంతరం చికిత్సనందించాం. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మీ ప్రేమాభిమానాలవల్లే ఆయన సురక్షితంగా ఉన్నారు" -జీవిత, రాజశేఖర్ భార్య
ఇది చదవండి: ప్రమాదంపై స్పందించిన నటుడు రాజశేఖర్