ప్రపంచంలో అందరూ జీవితా రాజశేఖర్‌ను(Jeevitha Rajasekhar Latest News) ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాము ఎవరూ చేయని తప్పులు చేశామా? అని నటి జీవిత ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)(MAA Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనరల్ సెక్రటరీగా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు జీవిత విలేకరులతో మాట్లాడారు.
MAA Elections: 'మాపై ఆరోపణలు హాస్యాస్పదం' - జీవితా రాజశేఖర్
కరోనా కాలంలో తామెంతోమందికి సాయం చేశామని అన్నారు ప్రముఖ నటి జీవితా రాజశేఖర్(Jeevitha Rajasekhar Latest News). సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశామని గుర్తుచేశారు. కళాకారులకు తమ వంతు ఎన్నో సహాయ సహకారాలు అందించినా.. కొంతమంది తమను టార్గెట్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
"తప్పులు చేయడం మానవ సహజం. వాటిని మేము సరిదిద్దుకున్నాం. సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశాం. ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టం. ఇదే విషయం మోహన్‌బాబుగారితో చెప్పా. 24 గంటలు బండ్ల గణేశ్ నా గురించి మాట్లాడారు. అందుకే ఆయనపై మాట్లాడాల్సి వచ్చింది. పృథ్వీ కూడా నాపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు హాస్యాస్పదం. అంతా జీవితా రాజశేఖర్‌నే టార్గెట్ చేస్తున్నారు. మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా? గతంలో 'మా' ఎన్నికల్లో పాల్గొనాలని నరేశ్‌గారే మమ్మల్ని కలిశారు. ఆయన చెప్పిన మాటలు విని ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. నరేశ్‌కు మద్దతుగా నిలిచాం. అయితే, ఈ ఆరోపణలు ఎన్నికల వరకూ మాత్రమే పరిమితం చేయాలని నరేశ్‌కు రాజశేఖర్‌గారు సూచించారు. ఆయన కూడా సరే అన్నారు. ఈ విషయంలోనే మాకూ నరేశ్‌కు విభేదాలు తలెత్తాయి. డైరీ విడుదల కార్యక్రమం సందర్భంగా ఏం జరిగిందో మీరంతా చూశారు. అప్పటి నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. 'మా' కోసం నరేశ్ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు" అని జీవిత అన్నారు.
ఇదీ చూడండి..MAA Elections: రెబల్‌స్టార్‌ను కలిసిన మంచు విష్ణు