హీరో రాజశేఖర్ ఆరోగ్యం గురించి వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని ఆయన భార్య జీవిత చెప్పారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.
రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ప్రకటన - రాజశేఖర్ కరోనా
తన భర్త రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన జీవిత.. అవాస్తవాలను నమ్మొద్దని చెప్పారు.
![రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ప్రకటన JEEVITH CLARIFIES ON RAJASEKHAR HEALTH CONDITION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9274392-503-9274392-1603371840479.jpg)
రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ప్రకటన
ఇటీవలే రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అయితే భార్య, పిల్లలు కోలుకున్నారు కానీ ఈయన మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయమై రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ట్వీట్ చేశారు. అంతకుముందు రాజశేఖర్ కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.