తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇది పోరాటం కాదు.. మహా సంగ్రామం.. - జయం రవి కొత్త తెలుగు సినిమా

జయం రవి కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'భూమి'. సంక్రాంతికి రానున్న ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Bhoomi Telugu Film release date
భూమి తెలుగు సినిమా విడుదల తేదీ

By

Published : Dec 31, 2020, 11:40 PM IST

'నువ్వు ఈ భూమిని ఎన్ని వేల అడుగుల ఎత్తు నుంచి చూసి ఉంటావు. ఏడు లక్షల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిని చూశాను నేను' అంటున్నారు’ తమిళ నటుడు జయం రవి. ఆయన కథానాయకుడిగా లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భూమి". నిధి అగర్వాల్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వ్యవసాయం నేపథ్యంలో "భూమి" తెరకెక్కింది. ఇందులో జయం రవి రైతుగా కనిపించనున్నారు. శంకర్‌ సినిమా తరహాలో ఇందులో సామాజిక సందేశం ఇమిడి ఉన్నట్లు చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ తెలిపారు. రోనిత్‌ రాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి:బైబై2020: కడలి అంచున కదిలేటి శిల్పమా!

ABOUT THE AUTHOR

...view details