తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వివాదంలో జయలలిత వెబ్​సిరీస్​ 'క్వీన్'..!

జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'క్వీన్'​ వెబ్​సిరీస్​కు తన అనుమతి తీసుకోలేదని చెప్పాడు ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్.

By

Published : Sep 23, 2019, 8:53 AM IST

Updated : Oct 1, 2019, 4:06 PM IST

రాజకీయ నాయకురాలు జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'క్వీన్' వెబ్​సిరీస్​ వివాదంలో ఇరుక్కుంది. దర్శకుడు గౌతమ్ మేనన్​.. తన అనుమతి తీసుకోకుండా ఈ వెబ్​ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారని ఓ ప్రకటన చేశాడు ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్. ఇదే కథాంశంతో ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న 'తలైవి'కి పర్శిషన్ ఇచ్చినట్లు చెప్పాడు.

జయలలిత- దర్శకుడు గౌతమ్ మేనన్

"అమ్మ(జయలలిత) ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె జీవితాన్ని రూపొందిస్తామంటే అభ్యంతరం లేదు. కానీ మా నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా బయోపిక్​ తీసే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అమ్మ గురించి ఏమైనా వేరుగా చూపిస్తే దావా వేసేందుకు కూడా వెనుకాడను". -దీపక్ జయకుమార్, జయలలిత మేనల్లుడు.

ఈ వెబ్ సిరీస్​లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఈ సిరీస్​ తొలి సీజన్​లో మొత్తం 11 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.​

జయలలిత- దర్శకుడు గౌతమ్ మేనన్

ఇదే కాకుండా 'తలైవి' అనే సినిమాను జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్నారు. బాలీవుడ్​ ఫైర్​ బ్రాండ్​ కంగనా రనౌత్.. జయ పాత్రలో కనిపించనుంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది చదవండి: బాలీవుడ్​ జేజమ్మగా కరీనా కపూర్​..!

Last Updated : Oct 1, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details