తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తలైవి' విడుదల తేదీ ఎప్పుడో తెలుసా..? - తెలుగు సినిమా వార్తలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవితాధారంగా 'తలైవి' చిత్రం తెరకెక్కుతోంది.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ ఒకటి విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ కథానాయిక.

'తలైవి' విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?

By

Published : Nov 23, 2019, 5:05 PM IST

Updated : Nov 23, 2019, 6:33 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ జయలలిత పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక టీజర్​ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. కంగనా.. జయలలిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంది.

ఎ.ఎల్​. విజయ్​ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాత. ఇందులో ఎమ్జీఆర్​గా నటుడు అరవింద స్వామి కనిపించనున్నాడు. సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్​ 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జార్జ్​రెడ్డి' పాత్ర చేయాల‌నుకున్నారు!

Last Updated : Nov 23, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details