తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అమ్మా.. నీవెప్పుడూ మా గుండెల్లో ఉంటావు'​ - అభిషేక్ బచ్చన్ న్యూస్​

నేడు నటి జయా బచ్చన్​ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమారుడు, నటుడు అభిషేక్​ బచ్చన్​ శుభాకాంక్షలు చెప్పాడు. తల్లిపై తనకున్న ప్రేమను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

Jaya Bachchan to ring in her birthday away from family, Abhishek reveals why
తల్లి పుట్టినరోజు జ్ఞాపకాలను పంచుకున్న అభిషేక్​

By

Published : Apr 9, 2020, 4:10 PM IST

బాలీవుడ్‌ మెగాస్టార్‌, అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి జయా బచ్చన్‌ ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్‌ సోషల్‌మీడియా వేదికగా తెలియచేశాడు. గురువారం జయ 72వ పుట్టినరోజు సందర్భంగా అతడు ఇన్‌స్టా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నానాటికి విపరీతంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆమె ప్రస్తుతం దిల్లీలో ఉందని అభిషేక్‌ పేర్కొన్నాడు.

అభిషేక్ బచ్చన్​, జయా బచ్చన్​

తన తల్లి జయా బచ్చన్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన అభిషేక్‌.. "తమకు ఎంతో ఇష్టమైన పదం 'అమ్మ' అని ప్రతి చిన్నారి చెబుతారు. హ్యాపీ బర్త్‌డే మా.!! లాక్‌డౌన్‌ కారణంగా నువ్వు దిల్లీలో మేము ముంబయిలో ఉండాల్సి వచ్చింది. నీ గురించి మేము ఎంతో ఆలోచిస్తున్నామని నీకు తెలుసు. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు. లవ్‌ యూ మా" అంటూ భావోద్వేగ సందేశం పెట్టాడు.

ఇదీ చూడండి.. యాంగ్రీ యంగ్​మ్యాన్​ను పెళ్లాడిన బెంగాలీ నటి

ABOUT THE AUTHOR

...view details