Jaya bachchan coronavirus: బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కొవిడ్ బారిన పడ్డారు. నెలవారి హెల్త్ చెకప్‌లో ఈ విషయం బయటపడింది. ముంబయిలోని తన ఇంట్లో ప్రస్తుతం జయ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కరోనా ఫస్ట్‌వేవ్‌లో జయ భర్త అమితాబ్, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. అప్పుడు జయా బచ్చన్‌కు మాత్రమే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆమె కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల జయ కుమార్తె శ్వేతా బచ్చన్‌కు కూడా ఈ వైరస్ సోకినట్లు తేలింది.