బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా వచ్చినట్లు శనివారం తేలింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా అందులో బిగ్‌బీ కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్ సోకినట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. అయితే అమితాబ్ భార్య జయా బచ్చన్, కుమార్తె శ్వేతా నందకు మాత్రం నెగిటివ్ వచ్చింది.
ఆదివారం ఉదయం.. ఐశ్వర్య, జయా బచ్చన్‌లకు కరోనా నెగిటివ్ వచ్చిందని ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. తాజాగా మరోసారి వారికి పరీక్షలు జరపగా, వైరస్ సోకినట్లు తేలింది.