తెలంగాణ

telangana

గేయ రచయిత జావేద్ అక్తర్​కు ప్రతిష్టాత్మక అవార్డు

By

Published : Jun 7, 2020, 7:25 PM IST

ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్.. ప్రతిష్టాత్మక రిచర్డ్ డాకిన్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు అందుకోనున్న తొలి భారతీయుడు ఈయనే కావడం విశేషం.

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జావేద్ అక్తర్
ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్

ప్రముఖ సినీ రచయిత జావేద్​ అక్తర్​.. ప్రతిష్టాత్మక రిచర్డ్ డాకిన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. లౌకికవాదం, హేతువాదం, శాస్త్రీయ సత్యాన్ని సమర్ధించడం వంటి విలువలను బహిరంగంగా ప్రకటించే వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 2003లో నెలకొల్పిన ఈ అవార్డును గతేడాది, నటుడు రికీ గెర్వైస్ అందుకున్నారు. అయితే దీనికి ఎంపికైన తొలి భారతీయుడు జావేద్ అక్తర్ కావడం విశేషం.

జావేద్ అవార్డుకు ఎంపిక కావడం పట్లు నటులు అనిల్ కపూర్, దియా మీర్జా, షబానా ఆజ్మీ తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

జావేద్.. బాలీవుడ్​లో 'దీవార్', 'జంజీర్', 'షోలే' వంటి అద్భుత చిత్రాలకు స్క్రీన్​ప్లేను అందించారు. ఈయన్ని భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2007లో పద్మభూషణ్​ బిరుదులతో సత్కరించింది. దీనితో పాటే ఉత్తమ గేయ రచయితగా ఐదు జాతీయ అవార్డులు, సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details