తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జబర్దస్త్'​లో జాతిరత్నాలు టీమ్ కితకితలు! - JatiRatnalu movie team in Jabardast

నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షోకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన 'జాతిరత్నాలు' చిత్రబృందం తమ కామెడీతో సందడి చేసింది. దీనికి సంబంధించిన తాజా ప్రోమో అలరిస్తోంది.

jabardast
జబర్దస్త్​

By

Published : Mar 11, 2021, 12:10 PM IST

Updated : Mar 11, 2021, 2:23 PM IST

నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్‌'. అనసూయ వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో కడుపుబ్బా నవ్విస్తోంది.

జబర్దస్త్​

నేటి(గురువారం) షోకు 'జాతిరత్నాలు' సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నవీన్​ పొలిశెట్టి, ప్రియదర్శి, హీరోయిన్​ ఫరియా అబ్దుల్లా అతిథులుగా విచ్చేశారు. వీరిలో నవీన్​ పొలిశెట్టి.. రోజాతో చేసిన కామెడీ టైమింగ్​ అదిరిపోయింది. వీరి పంచ్​లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇక హైపర్​ ఆది పంచ్​లు, కెవ్వు కార్తీక్​ టీమ్​లో ఇమ్మాన్యుయేల్​ మార్క్​ కామెడీ ఆకట్టుకుంటున్నాయి. రాకెట్​ రాఘవ, అదిరే అభి తమ స్కిట్​లతో సందడి చేశారు. మొత్తంగా ఈ షో ప్రేక్షకుల చేత కితకితలుపెట్టించేలా ఉంది. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ఫన్నీ ప్రోమోనూ మీరూ చూసేయండి.

Last Updated : Mar 11, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details