తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూఎస్ బాక్సాఫీస్​ దగ్గర 'జాతిరత్నాలు' రికార్డు - జాతిరత్నాలు న్యూస్

నవీన్ పోలిశెట్టి-అనుదీప్ కాంబినేషన్​లో వచ్చిన 'జాతిరత్నాలు'.. అమెరికాలో దుమ్మదులుపుతోంది. కొవిడ్ తర్వాత అక్కడి బాక్సాఫీస్​ దగ్గర ఐదులక్షల డాలర్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన తొలి సినిమాగా నిలిచింది.

JathiRatnalu occupies No 5 spot at US Box office and Crosses $500k on weekend
యూఎస్ బాక్సాఫీస్​ దగ్గర 'జాతిరత్నాలు' రికార్డు

By

Published : Mar 14, 2021, 3:03 PM IST

మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన 'జాతిరత్నాలు'.. ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది! వసూళ్లు కూడా సాధిస్తూ, ఆరోజే రిలీజ్​ అయిన మిగతా సినిమాలకు దీటుగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో యూఎస్​ బాక్సాఫీస్​ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించింది.

జాతిరత్నాలు సినిమా పోస్టర్

వారాంతంలో ఐదులక్షల డాలర్ల($500k) కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి యూఎస్ బాక్సాఫీస్​ దగ్గర వసూళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఇది చదవండి:రివ్యూ: కడుపుబ్బా నవ్వించే 'జాతిరత్నాలు'!

ABOUT THE AUTHOR

...view details