ఇటీవల విడుదలైన 'జాతిరత్నాలు' సినిమా అన్ని చోట్ల వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 'జాతిరత్నాలు' వసూళ్ల హంగామా - జాతిరత్నాలు ట్రైలర్
నవీన్-ఫరియా జంటగా నటించిన 'జాతిరత్నాలు'.. కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా 'జాతిరత్నాలు' వసూళ్ల హంగామా
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.17 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. పూర్తిస్థాయి కామెడీ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా నటించారు. అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు.
Last Updated : Mar 15, 2021, 9:48 PM IST