- యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'జాతిరత్నాలు'. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలే విడుదలైన 'చిట్టీ' లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
- హీరోయిన్ నందిత శ్వేత ప్రధానపాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'అక్షర'. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు.
- యువ కథానాయకుడు శ్రీ విష్ణు నటిస్తున్న గాలి సంపత్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్బాస్టర్'. ఈ సినిమాలోని 'నడికుడి రైలంటి సోదరా..' అనే లిరికల్ సాంగ్‌ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ పాటను వివేక్ ఆత్రేయ రచించగా.. వయాకామ్ విజయలక్ష్మి ఆలపించారు.
విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాలివే! - నవీన్ పొలిశెట్టి వార్తలు
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. 'జాతిరత్నాలు', 'అక్షర', 'గాలి సంపత్' చిత్రబృందాలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించాయి.
విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాలివే!
ఇదీ చూడండి:జాన్వీ సినిమాకు మరోసారి సాగు చట్టాల సెగ!