భారత మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాది నటి అనుపమ ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. డేటింగ్లో కూడా మునిగితేలుతున్నారంటూ సోషల్‌మీడియాలో ట్రోల్స్ హల్చల్ చేశాయి. దీనిపై తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది పరమేశ్వరన్.
" జస్ప్రీత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. తనతో డేటింగ్లో లేను. అయినా ఈ రోజుల్లో ఇలాంటి పుకార్లు రావడం సాధారణమైపోయింది ".
--అనుపమ, సినీ నటి
ఈ వార్తలు రావడానికి ఓ కారణం ఉంది. బుమ్రా సోషల్‌మీడియాలో ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమ కావడం, అలానే బుమ్రానూ అనుపమ ఫాలో అవడం వీటన్నింటికి ఆజ్యం పోసింది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరి ట్వీట్లను మరొకరు లైక్ చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
దక్షిణాదికే చెందిన నటి రాశిఖన్నాతోనూ గతంలో బుమ్రా ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి. దీనిపైనా అప్పట్లో క్లారిటీ ఇచ్చిందా బొద్దుగుమ్మ.
"బుమ్రాకు, నాకు వ్యక్తిగతంగా ఎప్పుడూ పరిచయం లేదు. ఇప్పటివరకు అతడిని కలవలేదు. టీమిండియా తరఫున స్టార్ క్రికెటర్ అని మాత్రమే తెలుసు" అని సమాధానమిచ్చింది రాశి.
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో 17 వికెట్లు తీసిన బుమ్రా... టీమిండియా సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అనుపమ ప్రస్తుతం 'రాక్షసుడు' అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను దక్షిణాధి భాషలన్నింటిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
ఇవీచూడండి...