తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' దోస్తీ సాంగ్.. జపాన్​ అభిమానులు నిరాశ

'ఆర్​ఆర్​ఆర్'​(RRR Movie) విషయంలో జపాన్​ సినీప్రియులు నిరాశ చెందారు. సోషల్​మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. స్పందించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మూవీ టీం త్వరలోనే వారి విన్నపాన్ని తీరుస్తామని మాట ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే?

RRR
ఆర్​ఆర్​ఆర్​

By

Published : Aug 2, 2021, 6:14 PM IST

'బాహుబలి'తో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి పెంచారు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ముఖ్యంగా జపాన్​ సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించారు. ఆ దేశానికి ప్రభాస్​, రానా, జక్కన్న, అనుష్క వెళ్లినప్పుడు ఎంతో ఘనంగా స్వాగతించారు. అయితే ఇప్పుడు 'ఆర్​ఆర్​ఆర్' సినిమా​ విషయంలో కాస్త నిరాశ చెందారు.

ఇంతకీ ఏమైందంటే?

ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్'​ తొలిపాట 'దోస్తీ'(RRR Movie Dosti song) విడుదలైంది. చెర్రీ-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్‌ త్రివేది (హిందీ), అనిరుధ్‌ (తమిళం), యాజిన్‌ నజిర్‌ (కన్నడ), విజయ్‌ ఏసుదాస్‌ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు స్టార్ సింగర్స్ ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. అయితే ఈ పాట తమ భాషలో ఎందుకు చేయలేదని జపాన్​ అభిమానులు సోషల్​మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

ఆర్​ఆర్​ఆర్​

ఈ విషయమై స్పందించిన 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్.. "ఈ పాట ఆడియో హక్కులు కొనుగోలు చేసిన లహరీ మ్యాజిక్​తో సంప్రదించాం. కొద్దిరోజులు ఎదురుచూడండి" అని రిప్లై​ ఇచ్చింది. ఆగస్టు 15న 'దోస్తీ' జపాన్​ వెర్షన్​ పాట రిలీజ్​ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న సినిమా విడుదల కానుంది. రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' (మేకింగ్ వీడియో) అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​

ABOUT THE AUTHOR

...view details