బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్ తనను ఎవరూ చూడటం లేదు అనే భావనతో అంకుల్ అనిల్ కపూర్ పాటకు డ్యాన్స్ చేసిందట. ఆమె టైటిల్ రోల్ పోషించిన సినిమా 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. శరణ్ శర్మ దర్శకుడు. ఇందులో జాన్వీ సోదరుడి పాత్రలో అంగద్ బేడీ నటించాడు. ఆగస్టు 12న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ప్రత్యేకించి జాన్వీ నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా తన ఆన్‌స్క్రీన్ సోదరుడితో కలిసి డ్యాన్స్ సాధన చేస్తున్న వీడియోను అంగద్ బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఎవరూ చూడట్లేదని జాన్వీ డ్యాన్స్.. కానీ! - జాన్వీ కపూర్ డ్యాన్స్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో 'గుంజన్ సక్సేనా' చిత్రంలో ఆమె సోదరుడిగా నటించిన అంగద్ బేడీతో కలిసి స్టెప్పులేసింది.
ఈ వీడియోలో ఇద్దరూ కలిసి అనిల్ కపూర్ గీతం 'మై నేమ్ ఈజ్ లఖన్'కు చిందేస్తూ కనిపించారు. "ఎవరూ చూడటం లేదనే ఫీలింగ్‌తో డ్యాన్స్ చేశాం. అనిల్ కపూర్ సర్.. దీన్ని మీకు అంకితం ఇస్తున్నాం. 'గుంజన్ సక్సేనా' సినిమాలోని సన్నివేశం కోసం రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఇది" అని అంగద్ పోస్ట్ చేశాడు. ఇందులో జాన్వీ చాలా సీరియస్‌గా అంగద్‌ను చూస్తూ స్టెప్పులేసింది.
శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల కుమార్తె జాన్వీ 2018లో 'ధడక్' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆపై నెట్‌ఫ్లిక్స్ 'ఘోస్ట్ స్టోరీస్'లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'తఖ్త్', 'రూహీ అఫ్జా', 'దోస్తానా 2' ఉన్నాయి.