తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీదేవిని మరిపించేలా జాన్వీకపూర్‌ డ్రెస్‌ - janvey kapoor

బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో లంగా-పట్టు పరికిణి ధరించి అచ్చం శ్రీదేవిలా కనిపించింది.

జాన్వీ

By

Published : Aug 13, 2019, 9:10 PM IST

Updated : Sep 26, 2019, 10:04 PM IST

అందాల తార జాన్వీకపూర్‌ ఈ రోజు ఉదయాన్నే తన తల్లి శ్రీదేవి జయంతిని తలుచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. "హ్యాపీ బర్త్‌డే ముమ్మా, ఐ లవ్‌ యు.."అంటూ రాసుకొచ్చింది. తన సన్నిహితురాలితో కలిసి దిగిన ఓ ఫోటోనూ షేర్ చేసింది.

ఈ ఫోటోలో జాన్వి.. శ్రీదేవిని మరిపించేలా, లంగా-పట్టు పరికిణి ధరించి, చాలా అందంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లంతా అచ్చం శ్రీదేవిలా అందంగా, పద్ధతిగా ఉందంటూ కామెంట్స్‌ పెట్టారు. ప్రస్తుతం కార్గిల్‌ వీరవనిత భారత వైమానికదళ ఫైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌గా వస్తోన 'కార్గిల్‌ గర్ల్‌' చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. త్వరలోనే పెళ్లి పీటలపైకి 'రాక్షసుడు' శీను

Last Updated : Sep 26, 2019, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details