బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోన్న 'గుడ్‌లక్ జెర్రీ' సినిమాకు మరోసారి రైతుల నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం పంజాబ్‌లోని పటియాలాలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడికి చేరుకున్న కొంతమంది రైతులు ఆందోళన చేపట్టడం వల్ల మరోసారి షూటింగ్ నిలిచిపోయింది.
కొన్ని వార్తాసంస్థల నివేదిక ప్రకారం.. సాగు చట్టాల విషయంలో కోపోద్రిక్తులైన కొంతమంది రైతులు పటియాలాలోని 'గుడ్‌లక్ జెర్రీ' షూటింగ్ ప్రదేశానికి చేరుకుని.. 'జాన్వీ కపూర్ వాపస్ జావో' (జాన్వీ కపూర్ వెనక్కి వెళ్లిపో) అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ముందు జాగ్రత్తగా చిత్రబృందం షూటింగ్‌ను నిలిపేసింది. దీంతో నటీనటులంతా తాము బసచేస్తోన్న హోటల్స్‌కు వెళ్లిపోయారు. నిరసనకారులు అక్కడికి వెళ్లి మరి ఆందోళన చేసినట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఆందోళన..