తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాన్వీకి సవాలైన పాత్ర ఇది: బోనీ కపూర్​ - హెలన్ రీమేక్ వార్తలు

మలయాళ చిత్రం 'హెలెన్​' హిందీ రీమేక్​లో స్టార్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది సవాల్​తో కూడుకున్న పాత్ర అని.. దానికి తగ్గట్టుగా జాన్వీ కష్టపడుతోందని చిత్ర నిర్మాత బోనీ కపూర్​ అన్నారు.

Janhvi Kapoor prep for Helen remake
హెలెన్​ రీమేక్​లో జాన్వీ కపూర్

By

Published : Mar 31, 2021, 7:14 PM IST

Updated : Mar 31, 2021, 7:27 PM IST

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ప్రస్తుతం తన చెల్లి ఖుషీ కపూర్‌, సోదరి అన్షులతో కలిసి యూఎస్‌ఏలో ఉంది. తను చేయబోయే కొత్త సినిమా 'హెలెన్‌' కోసం అక్కడే కసరత్తులు చేస్తోందట.

మలయాళంలో విజయవంతమైన 'హెలెన్‌' చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయన్నారు. మాతుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కథానాయిక పాత్ర చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఫ్రీజర్ గదిలో -18 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చలిలో 'హెలెన్' ఉంటుంది. ఆ క్రమంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు జాన్వీ చేయబోయో పాత్ర కూడా అదే.

దీనిపై చిత్ర గురించి నిర్మాత బోనీకపూర్‌ స్పందిస్తూ.."ఈ సినిమా జాన్వీకి సవాల్‌తో కూడుకున్నది. సహజంగా నటించకపోతే ప్రేక్షకులు సినిమాను తిరస్కరిస్తారు. ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ పాత్ర కోసం జాన్వీ చాలా కష్టపడాల్సి ఉంటుంది" అని తెలిపారు.

ఇదీ చూడండి:'ఫ్లాప్​ సినిమాకు సీక్వెల్​ అడుగుతారేంటి బాబూ?!'

Last Updated : Mar 31, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details