చిత్రపరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు అడుగు పెడుతుంటారు. కొందరు త్వరగానే గుర్తింపు సాధిస్తారు. శ్రీదేవి తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతోంది. గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలవైపు అడుగులేస్తోందీ భామ. ఈమెతో పాటు యువతరం నాయికల్లో సారా అలీఖాన్, అనన్యా ఉండే కూడా ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ల గురించే ఎందుకంటే జాన్వీకపూర్‌కు వీళ్లిద్దరే పోటీ అని బాలీవుడ్లో అనుకుంటున్నారట. ఇదే విషయమై ఓ ఇంటర్య్వూలో జాన్వీ స్పందించారు.
"మా మధ్య ఉండేది ఆరోగ్యకరమైన పోటీయే కానీ కొందరు దాన్ని చూడటంలోనే తేడా ఉంది. చిత్ర పరిశ్రమలో పదిమంది హీరోయిన్లు ఉంటే మా ముగ్గురి మధ్య పోటీ ఉందని అనడం ఏంటి? నేను ఆయితే ఇవన్నీ పట్టించుకోను. నా తోటి నాయికల సినిమాలు బాగుంటే వాళ్లను అభినం దించడానికి నేను అస్సలు వెనుకాడను."