తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కపూర్ ​సిస్టర్స్​, సత్యరాజ్​కు కరోనా నెగటివ్

తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్​కు ఏడు రోజుల కిందటే కరోనా సోకినట్లు తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​. తాజా పరీక్షల్లో నెగటివ్​ వచ్చినట్లు పేర్కొంది. కాగా, ఇటీవల వైరస్​ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్​ నటుడు సత్యరాజ్​ డిశ్ఛార్జ్​ అయ్యారు.

janvikapoor
జాన్వీకపూర్​

By

Published : Jan 11, 2022, 4:16 PM IST

చిత్రసీమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు నటులు వైరస్​ బారిన పడగా.. తాజాగా తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్​కు కూడా కొవిడ్​ సోకినట్లు తెలిపింది బీటౌన్​ హీరోయిన్ జాన్వీకపూర్. ఈ విషయాన్ని జాన్వీ ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ​జనవరి 3నే తామిద్దరికీ కరోనా సోకిందని, అప్పటి నుంచి ఐసోలేషన్​లో ఉన్నట్లు జాన్వీ పేర్కొంది. తాజా పరీక్షల్లో నెగటివ్​ వచ్చినట్లు చెప్పింది.

"జనవరి 3న మాకు కరోనా సోకింది. అప్పటినుంచి ఐసోలేషన్​లో ఉన్నాం. తాజా పరీక్షల్లో నెగటివ్​గా తేలింది. మొదటి రెండు రోజులు బాగా ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత మా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. ఈ వైరస్​ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్​, మాస్క్​ తప్పనిసరి. అందరూ జాగ్రత్తగా ఉండండి."

-జాన్వీ కపూర్​, హీరోయిన్​.

కాగా, జాన్వీ.. 'దోస్తానా 2', 'గుడ్​ లక్​ జెర్రీ', 'మిలి' చిత్రాల్లో నటిస్తోంది.

జాన్వీకపూర్​కు కరోనా

కట్టప్ప డిశ్ఛార్జ్​

ఇటీవలే కరోనా బారిన పడి ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్​ నటుడు సత్యరాజ్​.. హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తెలిపారు. సత్యరాజ్​ కోలుకున్నారని, ఇంటికి తిరిగి వచ్చేశారని పేర్కొన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తిరిగి మళ్లీ షూటింగ్స్​లో పాల్గొంటారని వెల్లడించారు.

ఇదీ చూడండి: రేణు దేశాయ్​, అకీరాకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details