శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన జాన్వీ కపూర్.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. 2018లో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తోంది. అందుకే ఆమె సినిమాలు కమర్షియల్గానూ విజయాలు సాధిస్తున్నాయి. జాన్వీ కూడా తన అందం, అభినయంతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.
డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ కపూర్!
జాన్వీకపూర్ నటించిన 'రూహి' చిత్రంలో ఓ పాట విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ వేసిన స్టెప్పులు, పలికించిన హావభావాలు తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి.
జాన్వీ నటిస్తోన్న 'రూహి' చిత్రం నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. అందులో ఆమె అదిరిపోయేలా స్టెప్పులేయడమే కాకుండా హావభావాల్లోనూ తన తల్లిని గుర్తు చేసింది. ఈ పాటలో జాన్వీని చూస్తుంటే 'మిస్టర్ ఇండియా' చిత్రంలో 'హవా హవాయి' పాటలో శ్రీదేవిని చూస్తున్నట్లే ఉందని అభిమానులు పోలుస్తున్నారు. రెండు పాటల్లోనూ తల్లి, కూతురు ధరించిన దుస్తులు ఒకేలా ఉండటం వల్ల అచ్చం శ్రీదేవిని చూసినట్లే అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి: అతిలోక సుందరి నందన.. నీ సొగసుకు వందనం