అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేస్తోంది జాన్వీ కపూర్. ఈ ఏడాది వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను జాన్వీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అద్దం ముందు నిలబడి ఆమె చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పాత హిందీ పాటకు పదం, పాదం కలుపుతూ ఆమె చేసిన డ్యాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. అచ్చం శ్రీదేవి డ్యాన్స్ చేసినట్లే ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వైరల్: అదిరిపోయే స్టెప్పులతో జాన్వీ సందడి - జాన్వీకపూర్ డాన్స్
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా చిత్రసీమకు పరిచయమైన జాన్వీకపూర్.. నటనలోనూ, నాట్యంలోనూ తన తల్లిని మైమరిపిస్తోంది. ఇటీవలే ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియా ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్: పాత పాటకు స్టెప్పులేసిన జాన్వీకపూర్
ప్రస్తుతం కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో జాన్వీటైటిల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'రూహీ అఫ్జానీ', 'దోస్తానా 2' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.
ఇదీ చూడండి.. జాన్వీ కపూర్‌తో కంటిన్యూ కానున్న 'లస్ట్ స్టోరీస్'
Last Updated : Mar 2, 2020, 12:52 PM IST