తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కామెంట్స్ చూసి భయపడే రకం కాదు: జాన్వీ కపూర్

'గుంజన్ సక్సేనా' సినిమా విడుదల సందర్భంగా ఇటీవల కాలంలో హీరోయిన్ జాన్వీ కపూర్​ చెప్పిన చిత్రీకరణ విశేషాలు, వ్యక్తిగత విషయాలు మీకోసం.

కామెంట్స్ చూసి భయపడే రకం కాదు: జాన్వీ కపూర్
నటి జాన్వీ కపూర్

By

Published : Aug 12, 2020, 11:11 AM IST

'ధడక్‌'లో జాన్వీ కపూర్‌ను చూసి 'ఎంత ముద్దుగా ఉందో ఈ అమ్మాయి' అనుకున్నారు. అంతలోనే 'నా రెండో సినిమా 'గుంజన్‌ సక్సేనా" అంటూ గర్వంగా ప్రకటించింది. బార్బీ డాల్‌లా ఉండే జాన్వీ... 'కార్గిల్‌ గాళ్‌' బాధ్యతను మోయగలదా అనిపించింది. అభిమానులను మెప్పించగలదా అనుకున్నారు. దానికి ఫస్ట్‌లుక్, ట్రైలర్‌తో 'యస్‌స్‌స్‌' అంటూ సమాధానం చెప్పింది. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా 'గుంజన్‌ సక్సేనా' గా వచ్చి అందరి మన్ననలు అందుకుంటోంది. ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి, తన గురించి జాన్వీ చాలా కబుర్లు చెప్పింది.

  1. గుంజన్‌ మేడమ్‌ పాత్రలో నేను కనిపిస్తున్నాను అని తెలిసేసరికి ఎంత గర్వంగా అనిపించిందో, అంతే బాధ్యతగా ఫీల్‌ అయ్యాను. అందుకే నాకు వీలైనంతవరకు కష్టపడ్డాను. సినిమా చిత్రీకరణకు ముందు 45 రోజులు శిక్షణ తీసుకుని పాత్ర కోసం సిద్ధమయ్యాను.
  2. గుంజన్‌ పాత్ర కోసం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, మానసికంగా సిద్ధమవ్వడం అంత సులభమేమీ కాదని నాకు తెలుసు. దాని కోసం పడ్డ కష్టం. సినిమా చూశాక మరచిపోయాను. ఇంతమంచి సినిమాలో భాగమయ్యాక ఆ బాధ గుర్తుండదు కదా.
  3. జాన్వీ @ ఇన్‌స్టాగ్రామ్‌: గుంజన్‌ సక్సేనా మేడమ్‌కు, నాకు కొన్ని పోలికలున్నాయి. ఇద్దరికీ ఎడారి అంటే ఇష్టం. ఇద్దరి చేతులూ పొడవుగా ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యం 'మా నాన్నలు ప్రపంచంలోనే మేటి'
    పైలట్ గుంజన్ సక్సేనాతో నటి జాన్వీ కపూర్
  4. గుంజన్‌ సక్సేనా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతో చేశారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని మరోసారి నిరూపించారు. అయితే సినిమా సెట్స్‌కు ఆమె వచ్చినప్పుడు 'నేను అంత గొప్ప పనేం చేశాను' అనేవారు. అదే ఆమె గొప్పతనం.
  5. ఓ రోజు షూటింగ్‌ చూడటానికి గుంజన్‌ వచ్చారు. ఆ రోజు నేను ఓ సన్నివేశం కోసం పదే పదే పరిగెత్తాల్సి ఉంది. వేర్వేరు యాంగిల్స్‌లో షాట్స్‌ కోసం, రీటేక్‌లు ఇలా చాలా సేపు పరిగెత్తాను. ఆ రోజు ఆమె నన్ను 'సినిమా కోసం ఇంత కష్టపడుతున్నావ్‌... అలుపు రావడం లేదా' అని అడిగారు. నిజ జీవితంలో మీరు చేసిన పనినే నేను సినిమాలో చేశాను. మీతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ అని చెప్పాను.
  6. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతుండాలి అని దర్శకుడు చెప్పాడు. సినిమా కథలో బలమేమో... అలా యాక్షన్‌ అనగానే ఇలానే వచ్చేసేవి. నాకు తండ్రి పాత్రలో నటించిన పంకజ్‌ సర్‌ 'బాగా చేశావమ్మా' అని చెప్పగానే చాలా ఆనందమేసేది.
    పంకజ్ త్రిపాఠితో జాన్వీ కపూర్
  7. లింగ వివక్షను గుంజన్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. అసలు దానిని ఒక అవరోధంగానే చూడలేదు. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు. దీన్ని నేను నా సినిమాల విషయంలో అన్వయించుకుంటున్నాను. మరింత కష్టపడి... మంచి సినిమాలు చేసి అభిమానుల మన్ననలు పొందాలన్నదే నా ధ్యేయం.
  8. 'ఈ సినిమా మీరెందుకు ఎంచుకున్నారు' అని అడుగుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పే సమాధానం 'నేను ఎందుకు చేయకూడదు'. ఓ మంచి పాత్రకు, నాకు సవాలు లాంటి పాత్ర ఇది. అందుకే ఎంచుకున్నాను.
  9. సినిమా ప్రారంభమైన కొత్తలో నేను చేయగలనా అనిపించింది. ఆ సత్తా నాకు ఉందా అనుకున్నాను. అయితే గుంజన్‌ను కలిసిన తర్వాత ఈ అవకాశం నాకు దక్కడమే గొప్ప గౌరవం అనిపించింది. ఇంతకుమించి మంచి అవకాశం రాదు అనిపించింది. ఆమెలా కనిపించడం కంటే పెద్ద గౌరవం ఇంకేముంటుంది.
  10. సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి నా నటన మీద ఏవో ఒక విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిని నేను పట్టించుకోను. నా వరకు సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నా కష్టం మీద, సినిమా కథ మీద నమ్మకం ఉంచాం. నా వరకు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ముఖ్యం. దాని కోసం మరిన్ని మంచి కథలు ఎంచుకుంటాను. నటిగా నిరూపించుకుంటాను. అప్పుడు నాపై విమర్శలు ఆగుతాయేమో.
    గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్
  11. సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చూసి భయపడే రకం కాదు నేను. అందుకే నా సోషల్‌ పేజీలో కామెంట్స్‌ను డిజేబుల్‌ చేయలేదు. వచ్చే ప్రతి కామెంట్‌ను చదవను కానీ... కామెంట్స్‌ ద్వారా అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అయినా వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పని, వాటిని ఎలా తీసుకోవాలో నాకో స్పష్టత ఉంది. కామెంట్స్‌ కావాలనే చేస్తున్నారా... నా మంచి కోసం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కదా.
  12. సినిమా కథలు ఎంచుకునే సమయంలో... ఈ కథ నా సినీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనేది ఆలోచిస్తాను. ఈ సినిమాతో కళామ్మతల్లికి నేను ఏం చేయగలుగుతాను అనే ఆలోచన కూడా ఉంటుంది. అందుకే ఏదో ఒక సినిమా చేసేయడం కంటే... నన్ను నేను నిరూపించుకునేలా మంచి సినిమా చేయాలనుకుంటున్నాను.
  13. సినిమాలో నేను యుద్ధ విమానం నడిపే సన్నివేశాలున్నాయి. దీని కోసం గుంజన్‌ నాకు చాలా విషయాలు చెప్పారు. దీని వల్ల ఆ సన్నివేశాల్లో నటించడం కాస్త సులభమైంది. ఆ సన్నివేశాల కోసం చాపర్‌లో చాలా సేపు కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడైతే చాపర్‌లో ఎక్కడేముంటాయి.. ఎలా పని చేస్తాయో తెలిసింది.
  14. అందరూ సినిమాల్లో బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం గురించి మాట్లాడుతున్నారు. మా కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పరిశ్రమలోకి వచ్చినా... అది మాకు కలకాలం అభిమానాన్ని తెచ్చిపెట్టదు. మాలో ఏదైనా ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్‌ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే పక్కన పెట్టేస్తారు.

ABOUT THE AUTHOR

...view details