తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సీన్​ కోసం తెగ ఇబ్బందిపడ్డ రాజేంద్రప్రసాద్ - తెలుగు మూవీ న్యూస్

హాస్యచిత్రాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్.. 'అహ నా పెళ్లంట' సినిమాలోని ఓ సన్నివేశం చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే? ఆయన పడ్డ ఇబ్బందులు ఏంటి?

rajendra prasad aha naa pellanta movie
రాజేంద్రప్రసాద్ అహ నా పెళ్లంట మూవీ

By

Published : Jun 1, 2021, 9:10 AM IST

టాలీవుడ్​లో ఎన్ని కామెడీ చిత్రాలు వచ్చినప్పటికీ 'అహ నా పెళ్లంట' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా నవ్విస్తూనే ఉంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర అద్భుతమే. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాత్రలైతే మరో ఎత్తు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ కోసం తానెంతగా ఇబ్బందిపడ్డాడో రాజేంద్రప్రసాద్ గతంలో వెల్లడించారు.

'అహ నా పెళ్లంట' సినిమాలోని ఓ సన్నివేశం

"జంధ్యాల విశ్వరూపం ఈ సినిమా. ఇందులో పేపర్ లుంగీ సీన్ గురించి ఇప్పటికీ చాలామంది గుర్తుచేసుకుని మరీ నవ్వుతుంటారు. ఆ సన్నివేశం కోసం నేనేంత ఇబ్బందిపడ్డానో! మళ్లీ మళ్లీ ఇలాంటి సినిమా చేయలేం" అని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

సురేశ్ సంస్థల అధినేత డి.రామానాయుడు.. ఈ సినిమాను రూ.18 లక్షలుపెట్టి తీస్తే, దానికి 35 రెట్లు వసూలు చేసిందీ సినిమా. ఓ కామెడీ చిత్రానికి ఇంత సత్తా ఉందా అని విమర్శకులు కూడా అప్పట్లో ఆశ్చర్యపోయారు. జంధ్యాల దర్శకత్వ ప్రతిభ ఆ తర్వాత కాలంలో ఎంతోమంది హాస్యచిత్రాలు తీయలనుకునే డైరెక్టర్లకు మార్గనిర్దేశనంగా నిలిచింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details