కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో అలరించేందుకు జేమ్స్ బాండ్ సిద్ధమవుతున్నాడు. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన 24 సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలో 25వ చిత్రం రానుంది. 'నో టైమ్ టు డై' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్.. బుధవారం విడుదల కానుంది.
చనిపోయేందుకు సమయం లేదంటున్న 'జేమ్స్‌బాండ్' - james bond series movie news
జేమ్స్‌బాండ్ సిరీస్‌లోని 25వ చిత్రం 'నో టైమ్ టు డై' ట్రైలర్.. ప్రేక్షకుల ముందుకు బుధవారం రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ట్వీట్ చేసింది.

చావడానికి సమయం లేదంటున్న 'జేమ్స్‌బాండ్'
ఇందులో జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత డేనియల్.. జేమ్స్‌బాండ్ పాత్రకు స్వస్తి చెప్పనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సుమారు రూ.250 కోట్ల మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదీ చూడండి: పవన్ చేతుల మీదుగా 'తొలిప్రేమ' రీమేడ్ సాంగ్