2009లో వచ్చిన 'అవతార్' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రేక్షకుల్ని ఊహాలోకంలో విహరించేలా చేసింది. వింత వింత జంతువులు, మనుషులు.. తమ గ్రహాన్ని కాపాడుకునేందుకు మానవులతో చేసే పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది. దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్పై ప్రశంసలు వెల్లువెత్తాయి.
'అవతార్-2' సినిమా విడుదల ఎప్పుడంటే? - డిసెంబరు 17,2021న వస్తున్న అవతార్-2
విభిన్న కథాంశంతో వచ్చి భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా 'అవతార్'. కొనసాగింపుగా వస్తున్న రెండో భాగం 2021 డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అవతార్-2' సినిమా విడుదల ఎప్పుడంటే..?
అవతార్కు కొనసాగింపుగా ప్రస్తుతం నాలుగు భాగాల్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా రెండో భాగం విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2021 డిసెంబరు 17న తీసుకువస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది.
మొదటి భాగంలో హీరోహీరోయిన్లుగా నటించిన శామ్ వర్తింగ్డన్, జో శాల్దానా ఇందులోనూ అదే పాత్రలు పోషించారు. స్టీఫెన్ లాంగ్, మిచెల్ రోడ్రిగ్జ్, వీవర్.. మిగతా పాత్రల్లో కనిపించనున్నారు.