ప్రతి బుధవారం కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'(Sridevi Drama Company) ఈసారి కాస్త డోసు పెంచి రాబోతోంది. అప్పట్లో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన 'జంబలకిడి పంబ'ను(Jambalakadi pamba) జబర్దస్త్ కమెడియన్లు స్పూఫ్ చేశారు.
'శ్రీదేవీ డ్రామా కంపెనీ'లో 'జంబలకిడి పంబ' - Jambalakidi pamba jabardast comedians spoof video
'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Drama Company) షోలో 'జంబలకిడి పంబ'ను జబర్దస్త్ కమెడియన్లు స్పూఫ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జూన్13న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసి నవ్వుకోండి.
బ్రహ్మానందం పాత్రలో హైపర్ ఆది కనిపించి కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ చీర కట్టుకొని డ్యాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. కమెడియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్టుగా మనకు తెలిసిన బుల్లెట్ భాస్కర్ ఈసారి గాయకుడిగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పాటలు అచ్చం వాళ్లలాగే పాడి వినిపించాడు. ప్రసాద్ వేసే పంచులతో చివర్లో పారిశుద్ధ్య కార్మికులకు అంకితం చేస్తూ ప్రదర్శించిన ఒక స్కిట్ అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ పూర్తి కార్యక్రమం జూన్ 13న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.
ఇదీ చూడండి: 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో 'వకీల్‌సాబ్'!