తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆస్కార్'​లో మన సినిమాకు మరోసారి నిరాశ

భారత్​ నుంచి 'ఆస్కార్​'కు వెళ్లిన జల్లికట్టు.. తుది రౌండ్​కు అర్హత సాధించలేకపోయింది. జోస్ పెల్లీస్సరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం విశేషం.

'Jallikattu' fails to make the cut at Oscars
ఆస్కార్ రేసులో జల్లికట్టు

By

Published : Feb 10, 2021, 10:47 AM IST

Updated : Feb 10, 2021, 10:55 AM IST

మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన 'జల్లికట్టు'.. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఫైనల్ 5'లో చోటు నిలుపుకోలేకపోయింది. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘచిత్రం విభాగంలో 'బిట్టు'.. తర్వాతి రౌండ్​కు అర్హత సాధించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు.

జల్లికట్టు సినిమాలో ఓ సన్నివేశం

జోస్ పెల్లీస్సరీ ఈ సినిమాను సామాజిక నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. 2019లో పలు భాషా ప్రేక్షకుల్ని అలరించింది. అదే ఏడాది టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 'జల్లికట్టు' చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా పెల్లీస్సరీ అవార్డు అందుకున్నారు.

93వ అకాడమీ అవార్డుల(ఆస్కార్) కార్యక్రమం ఫిబ్రవరిలో జరగాల్సింది కానీ కరోనా లాక్​డౌన్ వల్ల ఏప్రిల్ 25కు వాయిదా పడింది.

ఇది చదవండి:మనిషికి.. మనిషిలోని మృగానికి యుద్ధమే 'జల్లికట్టు'

Last Updated : Feb 10, 2021, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details